క్రిస్మస్‌కి 83

13 Oct, 2020 00:16 IST|Sakshi

కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలన్నీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయాయి. సినిమా థియేటర్స్‌ ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో కొత్త తేదీలను, పండగ సీజన్లను టార్గెట్‌ చేసి తమ చిత్రాల విడుదల తేదీలను లాక్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ‘83’ విడుదల తేదీని ఖరారు చేశారు. 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు