వెంటిలేటర్‌పై నటుడు.. దాతల కోసం ఎదురుచూపు

3 Dec, 2020 10:18 IST|Sakshi

ముంబై : ప్రముఖ హిందీ నటుడు శివకుమార్‌ వర్మ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా కూడా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు సైతం డబ్బులు సరిపోవడం లేదని, దాతల సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఈ మేరకు సినీ, టీవీ ఆర్టిస్ట్‌ ఆసోసియేషన్‌ నటుడు పరిస్థితిపై అఫీషియల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఇది చాలా అత్యవసరమని, శివకుమార్‌ వర్మ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. శివకుమార్‌ వర్మ పరిస్థితిపై నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌, విద్యాబాలన్‌ సహా పలువురు ప్రముఖులను ట్యాగ్‌ చేశారు. బాజీ జిందగీ కి, హల్లా బోల్ వంటి చిత్రాల్లో శివ్‌కుమార్ వర్మ నటించారు. (సన్నీ డియోల్‌కు కరోనా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు