Vidyut Jammwal: ఫ్యాషన్ డిజైనర్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘తుపాకీ’ విలన్‌

13 Sep, 2021 17:07 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు, ‘కమాండో’ ఫేం విద్యుత్‌ జమ్వాల్ (40) ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్‌ 13న) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో తన నిశ్చితార్థం జరిగిందని చెబుతూ, వారిద్దరూ కలిసున్న ఫోటోలను అతను షేర్‌ చేశాడు.

కాబోయే భార్య నందితా చేతులు ప​ట్టుకుని రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్‌ చేసిన విద్యుత్‌.. ‘ఇది కమాండో మార్గం.01/09/21’ అని క్యాప్షన్‌ జోడించాడు. అతను వివాహం చేసుకోబోతున్న నందితా వయసు కూడా 40 ఏళ్లే. ఇదే ఫోటోని ఆమె సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.

కాగా ఈ నటుడు ‘తుపాకీ’ సినిమాతో తెలుగు, తమిళ్‌ ప్రేక్షకులకి సుపరిచితుడే. అందులో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కాగా ఈ కమాండో హీరో ప్రస్తుతం ‘సనక్’, ‘ఖుదా హఫీజ్ చాప్టర్ II’ వంటి పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు.

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు