Kangana Marriage: 'చంద్రముఖి 2' బ్యూటీకి పెళ్లి.. ఆ ట్వీట్ వైరల్!

27 Sep, 2023 16:58 IST|Sakshi

సాధారణంగా హీరోయిన్లు గొడవలు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాలతో సావాసం చేస్తుంటారు. తెలుగులో ఈ తరహా ప్రవర్తన పెద్దగా ఉండదు కానీ బాలీవుడ్‌లో ఇలా ఎవరు చేస్తారనగానే కంగనా రనౌత్ పేరు గుర్తొస్తుంది. గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అవుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ అయిందట.

2006లో బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన కంగనా రనౌత్.. తెలుగులోనూ ప్రభాస్ 'ఏక్ నిరంజన్' మూవీలో హీరోయిన్‌గా చేసింది. అది ఆడకపోవడంతో మరో తెలుగు సినిమా చేయలేదు. నటిగా హిందీలో అద్భుతమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కంగన.. అదే టైంలో పలు గొడవల్లోనూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. హృతిక్‌తో రిలేషన్, ఖాన్ త్రయంపై కామెంట్స్ కావొచ్చు ఇలా పలు సందర్భాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

(ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ)

గత కొన్నాళ్లుగా కంగన సినిమా కెరీర్ ఏం బాగోలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం ఈమె 'చంద్రముఖి 2' అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇది ఈ గురువారమే(సెప్టెంబరు 28) రిలీజ్ కానుంది. మరోవైపు హిందీలో 'తేజస్', 'ఎమర్జెన్సీ' అనే చిత్రాల్లో నటించింది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.

అయితే కెరీర్ పరంగా కాస్త డౌన్ అయినట్లు అనిపిస్తున్న కంగన.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. ప్రముఖ హిందీ క్రిటిక్.. ఈ విషయాన్ని చెబుతూ రీసెంట్‌గా ఓ ట్వీట్ చేశాడు. ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ని కంగన పెళ్లి చేసుకోబోతుందని, ఈ ఏడాది డిసెంబరులో నిశ్చితార్థం, వచ్చే ఏప్రిల్‍‌లో పెళ్లి అని రాసుకొచ్చాడు. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు)

మరిన్ని వార్తలు