Nithya Menon: హీరో వేధింపులు.. అసలు నిజం చెప్పిన నిత్యామేనన్

26 Sep, 2023 18:16 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు.. ఇదీ ఎంతకు తెగని టాపిక్. ఎందుకంటే అవకాశాల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్‌ని పలువురు దర్శకనిర్మాతలు ఇబ్బంది పెడుతుంటారనేది చాలామందికి తెలుసు. అయితే స్టార్ హీరోయిన్ల విషయానికొస్తే.. ఇలా జరగడం చాలా అంటే చాలా తక్కువ. కానీ నిత్యామేనన్‌ని ఓ తమిళ హీరో వేధించడనేది ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు దీనిపై సదరు బ్యూటీనే క్లారిటీ ఇచ్చింది.

ఏం జరిగింది?
మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్.. 'అలా మొదలైంది' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్నాళ్ల మునందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే తెలుగు, తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన నిత్యామేనన్.. మన దగ్గర చివరగా 'భీమ్లా నాయక్' చేసింది. అయితే ఈ ఏడాది జూన్‌లో నిత్యామేనన్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలొచ్చాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు)

ఏం చెప్పింది?
'నేను చాలా తెలుగు సినిమాలు చేశాను కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం షూటింగ్ సమయంలో ఓ హీరో నన్ను పదేపదే తాకుతూ వేధించాడు' అని హీరోయిన్ నిత్యామేనన్ చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్ రాసుకొచ్చాయి. జూన్‌లో తొలుత ఈ కామెంట్స్ సెన్సేషన్ కాగా, ఇప్పుడు మరోసారి అవి తెరపైకి వచ్చాయి.

అసలు నిజమేంటి?
అయితే నిత్యామేనన్ పేరు చెప్పి వైరల్ అయిన ఈ కామెంట్స్ పూర్తిగా అబద్ధం. స్వయంగా ఈ బ్యూటీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తాను ఎవరికీ ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తారంటూ సీరియస్ అయింది. ఇదిలా ఉండగా 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్‌తో నిత్యా.. తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. సెప్టెంబరు 28న అమెజాన్ ప్రైమ్‌లో ఇది రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!)

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని వార్తలు