విజయవాడలో శ్రియ, ఫరియా సందడి.. ఫోటోలు వైరల్‌

9 Oct, 2021 12:55 IST|Sakshi

ముగ్ధచార్ట్‌ డిజైనర్‌ స్టోర్‌ ప్రారంభం

విజయవాడలో హీరోయిన్స్‌ శ్రియ, ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. లబ్బీపేట మహాత్మాగాంధీ రోడ్డులో ఏర్పాటు చేసిన ‘ముగ్ధ’ ఆర్ట్‌ డిజైనర్‌ స్టోర్‌ని ఆంధ్ర ప్రదేశ్‌ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి ప్రారంభించారు. ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి ఆధ్వర్యంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సినీనటి శ్రీయ, ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు మెచ్చేలా ముగ్ధ ఆర్ట్‌ డిజైనర్‌ షోరూమ్‌ ఉందన్నారు. 

శ్రియ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చానని, తొలుత దుర్గమ్మను దర్శించుకున్నానని తెలిపారు. ముగ్ధ ఆర్ట్స్‌ స్టూడియో కలెక్షన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. 

నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ..ముగ్ధ కలెక్షన్స్‌  ఫ్యాషన్స్‌ చాలా బాగుంటాయన్నారు. అనంతరం శశి వంగపల్లి మాట్లాడుతూ.. ముగ్ధలో కొలుగోలు చేయడానికి చాలా మంది విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారని, వారి కోసమే ఇక్కడ షోరూమ్‌ ఏర్పాటు చేశామని అన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.

మరిన్నితాజా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు