Aadavallu Meeku Johaarlu Twitter Review in Telugu - Sakshi
Sakshi News home page

Adavallu Meeku JoharluTwitter Review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఎలా ఉందంటే?

Published Fri, Mar 4 2022 8:17 AM

Adavallu Meeku Joharlu Movie Twitter Review In Telugu - Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.  కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.

దానికి తోడు ఈ మూవీలో  ఖుష్బూ, రాధికా శరత్‌ కుమార్, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు  ముఖ్య పాత్రల్లో నటిస్తుండడంతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’పై భారీ అంచనాలు పెరిగాయి.  ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. 

మొత్తంగా ఈ సినిమాకు నెటిజన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే.. మరికొంతమంది ప్లాప్‌ మూవీ అంటున్నారు. సినిమాలో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్‌ లేవని చెబుతున్నారు. రొటీన్‌ కథకు కామెడీ, రొమాన్స్‌ అందించి తెరకెక్కించారని చెబుతున్నారు. అయితే వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమాకు కలిసొచ్చిందని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాప్‌ యావరేజ్‌ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement