Ajay Devgn: ఆ తప్పులు చేసి రెండు సార్లు జైలుకు వెళ్లాను: అజయ్‌ దేవగణ్‌

13 Apr, 2022 21:15 IST|Sakshi

Ajay Devgn Says He Has Been In Jail Twice For His Mistakes: బాలీవుడ్‌లో మంచి స్టార్‌డమ్‌ ఉన్న హీరోల్లో అజయ్‌ దేవగణ్‌ ఒకరు. అటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించి మెప్పించాడు అజయ్‌ దేవగణ్. ఆయన తాజాగా హిందీలో చేస్తున్న చిత్రం 'రన్‌ వే 34'. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, రకుల్ ప్రీత్‌ సింగ్, ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న ఈ మూవీకి అజయ్‌ దేవగణ్‌ డైరెక్ట్‌ చేశాడు. 2008లో వచ్చిన 'యూ మే ఔర్‌ హమ్‌', 2016లో వచ్చిన 'శివాయ్‌' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

'రన్‌ వే 34' చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు అజయ్‌ దేవగణ్. ఈ క్రమంలో తన చిన్నతనంలో అజయ్‌ చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. 'ఈ విషయాలు ఇప్పుడుల చెప్పకూడదు. కానీ ఇదివరకూ చాలాసార్లు వీటి గురించి చెప్పాను. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో చాలా తప్పులు చేస్తుంటారు. కానీ నేను అంతకన్నా ఎక్కువే చేశాను. ఫలితంగా ఒక్కసారి కాదు రెండుసార్లు జైలుకు కూడా వెళ్లాను. ఒకసారి మా నాన్న గన్‌ను ఆయనకు తెలియకుండా దొంగలించి జైలుకు వెళ్లాను. ఇంకోసారి తప్పు చేసి రెండోసారి కూడా వెళ్లాల్సి వచ్చింది. నేను కాలేజ్‌ రోజుల్లో గూండాలా ప్రవర్తించేవాన్ని. నేటి జనరేషన్‌కు తెలియదు కానీ ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్‌ చేశాం.' అని తను చేసిన తప్పులు తెలిపాడు అజయ్‌ దేవగణ్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

చదవండి: ఆమె.. అజయ్‌ దేవగణ్‌ బలహీనత.. ఎవరంటే ?

చదవండి: అజయ్‌ దేవగన్ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఎమోషనల్‌ అయిన సింగం

మరిన్ని వార్తలు