పుష్ప టీజర్‌: ఆ సీన్‌ కోసం అల్లు అర్జున్‌ ఎంత కష్టపడ్డారో తెలిస్తే.. | Sakshi
Sakshi News home page

పుష్ప టీజర్‌: ఆ సీన్‌ కోసం అల్లు అర్జున్‌ ఎంత కష్టపడ్డారో తెలిస్తే..

Published Tue, Apr 9 2024 2:03 PM

Allu Arjun 51 Takes For Pushpa 2 The Rule Teaser - Sakshi

ఇకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప:ది రూల్‌ సినిమా టీజర్‌ విడుదలైంది. యూట్యూబ్‌లో పుష్ప గాడి సునామీ కొనసాగుతుంది. పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ అంటూ పార్ట్‌-1 లో పిచ్చెక్కించిన బన్నీ తాజాగా విడుదలైన తన చీరకట్టుతో దుమ్మురేపాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

తిరుపతిలో ఏటా ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో పుష్ప టీజర్‌ సాగింది. ఆ వీడియోలో ఊచకోత తర్వాత బన్నీ తన చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్‌ లేకుండా దేవీ శ్రీ బీజీఎమ్‌తో తెరకెక్కిన ఈ సీన్‌.. టన్నుల కొద్ది జోష్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌లో కనిపించింది. టీజర్‌ను చూసిన అందరూ ఈ సీన్‌కు ఫిదా అవుతున్నారు.

అయితే ఈ సీన్​ అంత ఈజీగా రాలేదని తెలుస్తోంది. ఐదు క్షణాల సీన్‌ కోసం బన్నీ పడిన కష్టం గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఆ ఒక్క షాట్‌ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట. ఆ చీర కొంగు కట్టే విధానం స్క్రీన్‌పై బాగా రావాలని ఆయన పట్టు పట్టారట. ఇదే విషయాన్ని సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. సినిమా కోసం తమ హీరో ఎంత డెడికేట్‌గా పనిచేస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  పుష్ప:ది రూల్‌ టీజర్‌ ఇప్పటి వరకు 40 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
Advertisement