అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్‌ | Pushpa Hero Allu Arjun Life-History, Success Story in Telugu - Sakshi
Sakshi News home page

Allu Arjun: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్‌

Published Fri, Aug 25 2023 12:07 PM

Allu Arjun Behind Story - Sakshi

తాత స్టార్‌ కమెడియన్‌ (రామలింగయ్య), మామయ్య స్టార్‌ హీరో (చిరంజీవి), నాన్న స్టార్‌ ప్రొడ్యూసర్‌ (అల్లు అరవింద్‌).. ఈ నేపథ్యంతో అల్లు అర్జున్‌ తెరంగేట్రం చేశారు. అది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడిందేమోగానీ స్టార్‌.. స్టైలిష్‌స్టార్‌ని చేసేందుకు మాత్రం కాదు. హీరో అంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటి..? మంచి లుక్స్‌..పర్సనాలటీ,కిల్లింగ్‌ స్మైల్‌ ఇలా కొన్ని తప్పక ఉండాల్సిందే. కానీ ఇవేమీ లేకుండా తన బ్యాంక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇస్తే ఏం చేస్తాం కొద్దిరోజులకు పక్కన పెట్టేస్తాం.

కానీ ప్రేక్షకులకు అల్లు అర్జున్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. గంగోత్రి సినిమా సమయంలో వీడు హీరో ఏంటిరా అనే స్టేజీ నుంచి ఆర్య సినిమాతో వీడురా హీరో అని స్థాయికి చేరాడు. వీడికి స్టైల్‌ అంటే తెలుసా..? అని హేళన చేసిన వారికి స్టైలిష్‌ స్టార్‌ అనే గుర్తింపుతో సమాధానం ఇచ్చాడు. నటన రాదు అనేవారికి జాతీయ అవార్డు అందుకున్న ఏకైక  హీరోగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచాడు.

గంగోత్రితో అవమానం ఎదుర్కొన్న బన్నీ
2003లో వచ్చిన తన తొలి చిత్రం 'గంగోత్రి'ని చూసిన వారందరూ ఆ వెంటనే వచ్చిన 'ఆర్య'ను చూసి ఆశ్చర్యపోయారు.  తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ ఆర్య అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అంతలా బన్నీ కష్టపడ్డాడు. మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన హీరో అనే గుర్తింపు నుంచి అల్లు హీరో అనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు.. దీని వెనుక అతని 20 ఏళ్ల కష్టం ఉంది. తన 20 ఏళ్ల సినీ జీవితంలో వేదం,రుద్రమదేవి, వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు.

ఆర్య సినిమా విడుదల తర్వాత బన్నీని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. మలయాళంలో ఆయనకు ఉన్నంత ఫ్యాన్స్‌ అక్కడి హీరోలకు కూడా ఉండరనే చెప్పవచ్చు. అందుకే అతన్ని మల్లు అర్జున్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రాంతం,భాష ఎలాంటి సంబంధం లేని తనకోసం వాళ్లందరూ చూపించే ప్రేమకు ఆయన మురిసిపోయాడు.

అందుకే ఆయన ఒకసారి ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదేనని చెప్పి దానిని పాటిస్తున్నాడు. అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ఇప్పటికీ ఫ్యాన్స్‌ అని ఆయన ఇంటికి వెళ్తే అక్కడున్నవారు భోజనం పెట్టి పంపుతారు. 'ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి నా అభిమానులే’ అని ఆయన చాలాసార్లు చెప్పాడు.

అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకం 

 సౌత్‌ ఇండియాలో సిక్స్‌ప్యాక్‌  ట్రెండ్‌ను దేశముదురు సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసింది అల్లు అర్జునే
  ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సౌత్‌ ఇండియా స్టార్‌గా అర్జున్‌ గుర్తింపు పొందాడు.
 'రుద్రమదేవి' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురు అయ్యాయని తెలుసుకున్న అర్జున్‌ దానికి తనలాంటి స్టార్‌ అవసరమనుకున్నాడు. ఆ సినిమా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్రతో మెప్పించాడు.
  పాలకొల్లులోని 'పంచారామ' క్షేత్రంలో గోశాల ఏర్పాటుకు ఎవరూ అడగకుండానే  రూ.18 లక్షలు విరాళం ఇచ్చాడు. గోశాలలోని ఆవులకు నిరంతరం అవసరమయ్యే ఖర్చును ఆయనే చెల్లిస్తానన్నాడు.
  వేదం సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించి నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు.
 ఎవరో బాలీవుడ్ జనాలు తన బాడీ,లుక్ మీద చేసిన కామెంట్‌ను సీరియస్‌ తీసుకొని ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్‌ శిక్షణ తీసుకొని సరికొత్త లుక్‌లో ఆర్యలో కనిపించి ఆ సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు.
  కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్‌కే ఎక్కువ అభిమానులు. పరాయి రాష్ట్రంలో ఏ హీరోకు ఇలాంటి ఆదరణ లేదు.
 పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌ ఎంటర్‌టైన్‌ కేటగిరిలో ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు.  ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్‌ హీరోగా రికార్డు సృష్టించాడు.

 ఫ్యాన్స్‌ కోసం ఒకరోజును ఆయన కేటాయిస్తారు.  ప్రతి గురువారం తన ఫ్యాన్స్‌ డైరెక్ట్‌గా ఆయన ఇంటి వద్దకు వెళ్లి బన్నీతో ఫోటోలు దిగుతుంటారు. ఒక్కోసారి షూటింగ్‌​ పనుల మీద ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్లినప్పుడు ఆ అవకాశం ఉండదు.

 పుష్ప సినిమా కోసం భుజం ఒకవైపు ఉంచి నటిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా కథ నచ్చడంతో రెడీ అనేశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన భుజానికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది.

 ► 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప' రూ. 365 కోట్లతో రికార్డు సృష్టించింది.

Advertisement
Advertisement