మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్పెషల్‌గా కనిపించిన ఆ ఇద్దరు! | Allu Arjun Host Varun Tej And Lavanya Tripathi Pre-Wedding Celebrations - Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో ఆ హీరోహీరోయిన్ కూడా!

Published Mon, Oct 16 2023 4:41 PM

Allu Arjun Host Varun Tej Lavanya Tripathi Pre Wedding Celebrations - Sakshi

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేందుకు టైమ్ దగ్గరకొచ్చేసింది. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబరు 1న ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా వేడుకగా అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీ జరగ్గా.. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

ఏడేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం తొలిసారి కలిసిన హీరోహీరోయిన్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి తమ బంధాన్ని సీక్రెట్‌గా మెంటైన్ చేస్తూ వచ్చారు. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అలానే వీళ్ల ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

కొన్నిరోజుల ముందు మెగా జోడీ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. తాజాగా ఆదివారం రాత్రి అల్లు ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఇందులో మెగా-అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీళ్లతో పాటు హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ కూడా కనిపించారు. వరుణ్ ఫ్రెండ్ నితిన్ కాగా, లావణ్య ఫ్రెండ్ రీతూవర్మ. మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నది అంటే వీళ్లే.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

Advertisement
Advertisement