Amazon Prime OTT Confirmed Satyameva Jayate 2 Release Date - Sakshi
Sakshi News home page

Satyameva Jayate 2: సత్యమేవ జయతే 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Wed, Dec 22 2021 2:26 PM

Amazon Prime Video Confirmed Satyameva Jayate 2 Release Date - Sakshi

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో జాన్‌ అబ్రహాం నటించిన లేటెస్ట్‌ మూవీ 'సత్యమేవ జయతే 2'. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్య కోశ్లా కుమార్‌, రాజీవ్‌ పిళ్లై, అనుప్‌ సోని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. నవంబర్‌ 26న రిలీజైన థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా నెలరోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో రేపటి (డిసెంబర్‌ 23) నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది. ఒక్క భారత్‌లోనే కాకుండా 240కి పైగా దేశాల్లో సత్యమేవ జయతే 2 చిత్రం అందుబాటులోకి రానుంది. నిజానికి థియేటర్‌లో ఈ సినిమాను మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఉండి చూసేయండి.

Advertisement

తప్పక చదవండి

Advertisement