యాంకర్‌ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా..

3 May, 2021 16:18 IST|Sakshi

తెలుగు టెలివిజన్‌ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్‌ సుమ. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సటైరికల్‌ పంచ్‌లతో దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుండే సుమ సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. కాగా తాజాగా సుమ ఫేస్‌బుక్‌లో తన తల్లికి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది.

70 ఏళ్ల వయసులో కూడా ఆమె తల్లి వ్యాయామం, కసరత్తులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఏ వయసులో అయినా మనస్సు ఎల్లప్పుడూ శక్తివంతంగా, ఉత్సతాహం ఉంచుకొవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. దీనికి మా అమ్మ గొప్ప ఉదహరణ. 79 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎనర్జీటిక్‌ ఉంటారు. దీనికి కారణం ఆమె ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను తీసుకుంటుంది. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఆమె అమ్మ ముద్దు పేరు బేబీ.

ఈ వీడియో ప్రతి కుటుంబానికి, తమని తాము ఆరోగ్యంగా చూసుకునే ప్రతి గొప్ప తల్లులకు అంకితం’ అంటూ వీడియో షేర్‌ చేసింది. కాగా సుమ ఇటీవల లేగ దూడ మూతికి వెదురు బుట్టి కట్టిన వీడియో షేర్‌ చేసి నెటిజన్ల అగ్రహహానికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో మీకు క్రూరత్వం కనిపించడం లేదా అంటూ తనపై చేసిన ట్రోల్స్‌పై సుమ స్పందించి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని అది తెలియదా అంటూ ట్రోలర్స్‌కు ఘూటుగా సమాధానం ఇచ్చారు. 

చదవండి: 
లేగదూడ వీడియో : ట్రోలర్స్‌ నోరు మూయించిన సుమ కనకాల

మొద‌టిసారి సుమ‌పై నెటిజ‌న్ల ఫైర్‌.. కార‌ణం ఏంటంటే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు