వైజాగ్‌ అల్లుడొచ్చాడు.. వస్తూనే సందడి చేశాడు..

3 Jun, 2022 19:10 IST|Sakshi
మాట్లాడుతున్న హీరో నాని... చిరునవ్వుల న జ్రియా

ఏయూక్యాంపస్‌(విశాఖపట్నం): విశాఖ అల్లుడొచ్చాడు...వస్తూనే సందడి చేశాడు.. ఈనెల 10న విడుదల కానున్న అంటే సుందరానికి..చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో నిర్వహించిన ట్రైలర్‌ రిలీజ్‌కు చిత్ర హీరోయిన్‌ నజ్రియా ఫాహద్‌తో కలిసి హాజరయ్యారు. ఎమోషన్స్, హ్యూమన్‌టచ్‌ అన్నీ కలిసిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం తీశామన్నారు. లీల క్యారెక్టర్‌లో నజ్రీయాను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమన్నారు.
చదవండి: నవ్వులు పూయిస్తున్న అంటే సుందరానికీ ట్రైలర్‌..

తన చిత్రం గురించి మాట్లాడుతూ యూత్‌ సుందరాన్ని ఫాలో అవ్వద్దంటూ సూచించారు. సుందరం కనిపించేటంత అమాయకుడు కాదన్నారు. సినిమా మాతో కలసి చూడాలని అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిత్ర విజయోత్సవం ఇక్కడ సెలబ్రేట్‌ చేసుకుంటానన్నారు.

తాను విశాఖ అల్లుడినని సాధారణంగా అల్లుడికి విందు ఇస్తారని, కాని ఈ నెల 10న తానే విశాఖ ప్రజలకు తన సినిమాతో విందు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. చిత్ర హీరోయిన్‌ నజ్రియా మాట్లాడుతూ ఇది తన తొలి చిత్రమని, డబ్బింగ్‌ కూడా చెప్పానన్నారు. తెలుగులో మరిన్ని మంచి చిత్రాలను నటించాలని ఉందన్నారు. చిత్ర నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ నాని విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారన్నారు.
   
నాని ఫ్యామిలీ పిక్‌తో అభిమానుల సందడి 

మరిన్ని వార్తలు