ఎలాగు వారిని తీసుకురాలేము, కానీ మరొకరు అలా..: అనుష్క

4 May, 2021 15:49 IST|Sakshi

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా కొరలుచాస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది మహమ్మారి మరింత ప్రభావం చూపేడుతోంది. రోజురోజుకు కోవిడ్‌ మరణాలు రెట్టింపవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజయకీయ ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలకు సందేశాలు ఇస్తు వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

తాజాగా టాలీవుడ్‌ అగ్రనటి అనుష్క శెట్టి సైతం ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ‘ప్రస్తుత క్టిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి ఎప్పటికీ తీసుకురాలేము. అయితే ఈ కరోనాకు మరొకరు బలికాకుండా మాత్రం జాగ్రత్త పడగలం. ఇందుకోసం ఒకరికొకరం సాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. దీని నుంచి బయటప పడాలంటే అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండేందుకే ప్రయత్నించండి’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ‘మీకు మీరే స్వీయ నిర్భంధాన్ని విధించుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. వారితో సమయాన్ని గడుపండి. ప్రతీ ఒక్కరికీ వారి బాధను ఎలా చెప్పుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు. అందరూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఈ సమయంలో పాజిటివ్‌ ఎనర్జీ చాలా అవసరం. అలాగే ఇతరులకు చేతనైన సాయం చేయండి. అది ప్రార్థనలైనా కావచ్చు. మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం. నెగెటివిటీ మీద దృష్టి పెట్టి మనకున్న శక్తిని వృథా చేసుకోవద్దు. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు’ అంటూ స్వీటీ సందేశాన్ని ఇచ్చారు. 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

చదవండి: 
త్వరలోనే స్వీటీ పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..! 
‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు