మొదటి ప్రయాణం మరచిపోకూడదు: త్రినాథరావు నక్కిన

21 Aug, 2023 01:02 IST|Sakshi
చంటి, లహరి, త్రినాథరావు నక్కిన

‘‘నాది, బెక్కెం వేణుగోపాల్‌గారి ప్రయాణం చిన్న సినిమా నుంచే ప్రారంభమైంది. అప్పట్లో మా సినిమా పొస్టర్, టీజర్, ట్రైలర్‌లను ఎవరు రిలీజ్‌ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా మొదటి ప్రయాణం మరచిపొకూడదు కదా?. అందుకే ఎవరైనా సపొర్ట్‌ కావాలని అడిగితే మా వంతు సపొర్ట్‌ చేయటానికి,ప్రొత్సహించటానికి వెనుకాడం’’ అని డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన అన్నారు.

చంటి, లహరి జంటగా కేవీఆర్‌ దర్శకత్వంవహిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. ‘నెంబర్‌ మిస్సింగ్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషక్స్ పై నారాయణ స్వామి.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పొస్టర్‌ను త్రినాథరావు నక్కిన, ఫస్ట్‌ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ రిలీజ్‌ చేసి, ‘ఏపీ 31’ హిట్‌ కావాలన్నారు. ‘‘అందరి సపొర్ట్‌తో సినిమాను పూర్తి చేస్తున్నాం’’ అన్నారు కేవీఆర్‌.
 

మరిన్ని వార్తలు