బిగ్‌బాస్‌: అరియానా ఖాతాలో అరుదైన ఘనత

11 Feb, 2021 11:16 IST|Sakshi

యాంకర్‌గా కేరీర్‌ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం​ తీరిక లేకుండా పోయింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో రాజ్‌ తరణ్‌ కలిసి ఈ మూవీలో నటించనుంది. ఈ క్రమంలో ఇటీవల గోవా పర్యటనకు వెళ్లిన అరియాన సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మను కలిసిన సంగతి తెలిసిందే. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్‌తో కలిసి ఎంజాయ్‌ చేసింది. (చదవండి: గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా)

ఈ నేపథ్యంలో అరియానా అక్కడ వర్మను కలిసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకుంది. ఇదిలా ఉండగా ఈ భామకు ఓ అరుదైన ఘనత దక్కింది. బిగ్‌బాస్‌ షోతో ఎంతో క్రేజ్‌ అందుకున్న ఆమె .. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం. దీంతో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్‌లీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో అరియాన హాట్‌టాపిక్‌ అయిపోయింది. అయితే ఇప్పుడు గూగుల్‌ ఆమె పేరును తొలగించింది. (చదవండి: గుడ్‌ న్యూస్‌ చెప్పిన అరియానా.. యంగ్‌ హీరోతో..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు