ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్‌ హీరో హెచ్చరిక!

1 Mar, 2021 14:15 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రేమ జంట అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరాను ఫొటోగ్రాఫర్లు నీడలా వెంటాడుతున్నారు. ఈ లవ్‌ బర్డ్స్‌ ఎక్కడికి వెళ్లినా వారిని కెమెరాలో బంధిస్తూ క్లిక్‌మనిపిస్తున్నారు. ఆదివారం నాడు అర్జున్‌, మలైకా.. కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ దంపతుల నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్‌ వీరిని తన కెమెరాలో బంధించేందుకు తెగ ఆరాటపడ్డాడు. ఇందుకోసం ఏకంగా కరీనా ఇంటి గోడెక్కడానికి ప్రయత్నించాడు. అది చూసిన అర్జున్‌ ఆగ్రహానికి లోనయ్యాడు.

వెంటనే అతడిని సమీపించి ఇది చాలా తప్పు అని చెప్తూ ముందు గోడ దిగండి అని కోరాడు. 'అసలు అలా ఎలా గోడెక్కుతారు? మీరు చేసేది చాలా తప్పు' అంటూ వారించాడు. దీంతో అతడు వెంటనే గోడ దిగేశాడు. తర్వాత ఈ ప్రేమ పక్షులు కరీనా ఇంట్లోకి వెళ్లి ఆమె రెండో కొడుకును చూసి, వారికి శుభాకాంక్షలు చెప్పి బయటకు వచ్చారు. వీరిని చూసిన సదరు ఫొటోగ్రాఫర్‌ తను చేసిన పనికి చింతిస్తూ అర్జున్‌కు క్షమాపణలు చెప్పాడు.

ఇదిలా ఉంటే కరీనా కపూర్‌ ఫిబ్రవరి 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ తల్లీకొడుకులను చూసేందుకు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్లొస్తున్నారు. కానీ ఇప్పటివరకు సైఫ్‌ దంపతులు వారి కొడుకు ఫొటోలను అభిమానులతో పంచుకోనేలేదు.

చదవండి: ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన బాలీవుడ్‌ నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు