‘అతడు ఆమె ప్రియుడు’ ట్రైలర్‌ వచ్చేసింది

20 Jan, 2022 14:08 IST|Sakshi

సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..  ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన "అతడు ఆమె ప్రియుడు" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు