Sakshi News home page

రౌడీ హీరో కామెంట్స్‌పై ట్రోలింగ్‌.. నచ్చితే చూడు, లేదంటే మానేయ్‌ అన్న నిర్మాత

Published Thu, Apr 4 2024 4:22 PM

Baby Producer SKN Reacts To Netizen Comments On Vijay Deverakonda Lifestyle, Tweet Viral - Sakshi

హీరో విజయ్‌ దేవరకొండ.. మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చినవాడే! ఎన్నో కష్టాలు పడి గొప్ప స్థాయికి ఎదిగాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీస్టార్‌ రేపు(ఏప్రిల్‌ 5న) రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు సినిమా తర్వాతే బైక్‌ ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించాను.. అప్పటివరకు నా జీవితంలో బండి ఫుల్‌ ట్యాంకు కొట్టించలేదు అని చెప్పాడు. ఇది చూసిన కొందరు అంత సీన్‌ లేదు.. నీకు మంచి బ్యాగ్రౌండ్‌ ఉంది.. నువ్వు మిడిల్‌ క్లాస్‌ అంటే నమ్మమంటూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు.

అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు
ఈ ట్రోలింగ్‌పై బేబీ, టాక్సీవాలా చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్‌ (శ్రీనివాస కుమార్‌) స్పందించాడు. 'ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కంటెంట్‌ బాగోలేకపోతే సినిమా చూడం.. ఒకవేళ డబ్బులున్నవాడని కంటెంట్‌ బాగున్నా సినిమా చూడకుండా ఆగిపోము. కాబట్టి అతడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అతడు శ్రీనగర్‌లో మాకు దగ్గర్లోనే ఓ చిన్నపాటి ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు. నేను అతడిని ఫస్ట్‌ టైమ్‌ అక్కడే కలిశాను. కష్టపడి పైకి వచ్చినవాళ్లకు.. ఆ కష్టాన్ని చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉంది. అందుకే అది ఆయన ఎక్స్‌ప్రెస్‌ చేస్తున్నాడు. ఆ ఫీలింగ్‌ ఏంటో నాకు తెలుసు.

డబ్బులు సంపాదించాలనే..
నచ్చితే సినిమా చూడు, లేకపోతే మనేయ్‌. ఎందుకు ఒకరి మీద పడి ఏడవడం సోదరా? వీలుంటే అతడి పదాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకో.. కష్టపడి తనలా ఓ స్థాయికి ఎదుగు. అప్పుడు నీకు ఆ తృప్తి ఏంటో తెలుస్తుంది' అని కౌంటర్‌ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి.. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ అమెరికా వెళ్లాడుగా.. మరి మధ్యతరగతి వ్యక్తికి అదెలా సాధ్యమని ప్రశ్నించాడు. దీనికి ఎస్‌కేఎన్‌ స్పందిస్తూ.. మిడిల్‌ క్లాస్‌ కాబట్టే డబ్బులు సంపాదించుకుందామని పోయాడు. కోట్లు ఉంటే ఇక్కడే ఎంజాయ్‌ చేస్తారు కదా.. ఇప్పుడు అమెరికా, కెనడా పోయే విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారందరికీ కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించాడు.

చదవండి:  డేరింగ్‌ స్టంట్స్‌.. అజిత్‌ కారు ప్రమాదం వీడియో వైరల్‌

Advertisement
Advertisement