గుడ్‌ న్యూస్‌ చెప్పిన అరియానా.. యంగ్‌ హీరోతో..

22 Jan, 2021 14:30 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన అరియానా గ్లోరీ లక్కీ చాన్స్‌ కొట్టేసినట్టు తెలుస్తోంది. బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్‌ ఇప్పుడు హీరోయిన్‌గా మారనుందని తెలుస్తోంది. యాంక‌ర్‌గా రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. బిగ్‌బాస్‌ షోలో అరియానా టాప్ 4లో ఉండడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడుఈ అమ్మడుకి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది.

యువ నటుడు రాజ్ త‌రుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్ ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్‌బాస్ త‌ర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్‌తరుణ్‌, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌‌ని హ్యాష్ ట్యాగ్‌ చేసింది. 

అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు అర్ద‌మ‌వుతుంది. పూజా కార్యక్రమం కూడా పూర్తయినట్టు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చదవండి:
వైరల్‌: ఈ బిగ్‌బాస్‌ హీరోను గుర్తుపట్టారా?

A post shared by Anchor Ariyana (@ariyanaglory)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు