Bigg Boss 7: కొంప మునిగింది.. 'పవరస్త్ర' కోసం పోతే ప్రమాదం!

22 Sep, 2023 18:30 IST|Sakshi

బిగ్‌బాస్ 7.. మూడో వారంలోకి వచ్చేసింది. తొలిరెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ రియాలిటీ షో క్రమక్రమంగా గొడవలతో హీటెక్కుతున్నట్లు అనిపిస్తుంది. హౌసులో ఉండేందుకు, పవరస్త్ర సాధించేందుకు కంటెస్టెంట్స్ దేనికైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ కంటెస్టెంట్స్ ఇప్పుడు గాయపడింది. కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తింది. ఇంతకీ ఏమైంది?

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

ఏం జరిగింది?
మూడో పవరస్త్ర కోసం జరుగుతున్న పోటీలో కంటెండర్స్‌గా యవర్, శోభాశెట్టి, ప్రియాంక ఉన్నారు. అయితే ప్రియాంక స్థానంలో అమరదీప్ ఉండాల్సింది. కానీ జత్తు కత్తిరించుకోని కారణంగా అతడి బదులు ప్రియాంక పోటీలో నిలిచింది. అయితే మరో ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్.. ప్రిన్స్ యవర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో పవరస్త్ర ఫైనల్ పోరు కోసం ప్రియాంక, శోభాశెట్టి నిలిచాడు.

బుల్ ఫైట్- ప్రమాదం
ఇక చివరి టాస్కులో భాగంగా ఎలా పడితే అలా కదిలే ఎలక్ట్రిక్ ఎద్దుపై ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వాళ్లదే పవరస్త్ర అని బిగ్‌బాస్ చెప్పాడు. హైట్ తక్కువ కావడంతో ప్రియాంక.. అలా దానిపై పూర్తిగా పడుకుని ఉండిపోయింది. శోభాశెట్టి మాత్రం ఆ జర్క్‌లకు తట్టుకోలేకపోయింది. ఓ సందర్భంగా పట్టుకున్న తాడుని వదిలేసి కిందపడింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి గాయమైంది. దాన్ని గౌతమ్ చూస్తున్న క్రమంలోనే నొప్పితే అరిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఇన్నాళ్లకు మోక్షం కలిగింది)

మరిన్ని వార్తలు