Bigg Boss OTT 2: Pooja Bhatt opens up about her married life with ex-husband Manish Makhija - Sakshi
Sakshi News home page

Pooja Bhatt: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసింది

Published Fri, Jun 23 2023 7:12 AM

Bigg Boss OTT 2 Pooja Bhatt Opens About Her Married life With Manish Makhija - Sakshi

దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లోని స్టార్ హీరోలు కూడా ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జియో సినిమాలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి కూడా ఈ హౌస్‌లోకి  పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. వారిలో నటి, దర్శకురాలు పూజా భట్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ సందర్భంగా తనకు పిల్లలు ఎందకు పుట్టలేదో తోటి పోటీదారులతో తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగానే మాట్లాడింది.

(ఇదీ చదవండి: టాప్‌ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)

పూజా భట్ తన వివాహం గురించి తనతో పాటు ఉన్న మరొక కంటెస్టెంట్ బోబికా ధూర్వేతో ఇలా చెప్పింది. 'నాకు పెళ్లయి దాదాపు 11 ఏళ్లు అవుతోంది. కానీ నేను ఆ సమయంలో పిల్లలను కనడానికి సిద్ధంగా లేను. నాకు పిల్లలు కావాలి, నేను పిల్లలను ప్రేమిస్తున్నాను.. కానీ ఆ సమయంలో నేను పిల్లలను కనాలని కోరుకోలేదు. నేను ఆ సమయంలో దూరంగానే ఉండేదాన్ని. అంతా నా వల్లే జరిగింది.'  అని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌లో వీడియో జాకీగా గుర్తింపు తెచ్చుకున్నమనీష్ మఖిని ప్రేమించి 2003లో పూజా భట్ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత 2014లో ఈ జంట విడాకులు తీసుకుంది.

Advertisement
Advertisement