Bigg Boss 6 Telugu Latest Promo: Challenges For Housemates To Get A Chance For Voting Appeal - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఎట్టకేలకు రోహిత్‌ ఉన్నాడని గ్రహించిన హౌస్‌మేట్స్‌

Published Thu, Dec 15 2022 5:53 PM

Bigg Boss Telugu 6: Challenges For Housemates to Get a Chance For Voting Appeal - Sakshi

కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్‌. మరో మూడు రోజుల్లో గ్రాండ్‌ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్‌ ఖుషీలో ఉన్నారు టాప్‌ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్‌ నుంచి పంపించేయనున్నారు. మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. 

ఇకపోతే ఎప్పటిలాగే ఓట్‌ అప్పీల్‌ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో సౌండ్స్‌ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్‌ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్‌ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్‌. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్‌ చేసుకుంటూ వచ్చిన హౌస్‌మేట్స్‌ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్‌ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు.

అలాగే ఓట్‌ అప్పీల్‌ కోసం మరో టాస్క్‌ ఇవ్వగా ఇందులో రేవంత్‌, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్‌.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్‌ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్‌ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌కు బలి
నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి

Advertisement
Advertisement