రికార్డుల్ని బద్దలుకొట్టిన 'బిగ్‌బాస్‌' 4 లాంచ్‌

18 Sep, 2020 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బార్క్‌ 36వ వారం గణాంకాల ఆధారంగా, తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మైంట్‌ ఛానళ్లలో స్టార్‌ మా అప్రతిహతంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 లాంచ్‌ అత్యధిక రేటింగ్స్‌ సాధించింది. రియాలిటీ షో లాంచ్‌లు సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది కూడా ఒకటి. ఈ సీజన్‌ ఒక సంచలనంతో మొదలైంది. బార్క్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అత్యద్భుతమైన ఆరంభ విజయంగా అభివర్ణించిన ఈ తొలివారం లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ లాంచ్‌ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్‌ సాధించింది. లాంచ్‌ ఎపిసోడ్‌ 18.5 టీవీఆర్‌ నమోదు చేసింది.

నాన్‌ ఫిక్షన్‌ షో కేటగిరీలో బార్క్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్‌ సాధించిన లాంచ్‌ ఎపిసోడ్‌గా మాత్రమే కాదు బిగ్‌బాస్‌ తెలుగు (తొలి సీజన్‌ నుంచి) చరిత్రలో ఏ సీజన్‌లోనూ చూడనంతగా ఈ లాంచ్‌ ఎపిసోడ్‌ అత్యుత్తమ రేటింగ్‌ సాధించింది. గణాంకాలను బట్టి స్టార్‌ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో స్పష్టమైన లీడర్‌షిప్‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగువారాలతో పోలిస్తే స్టార్‌ మా సరికొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ 18 శాతం అభివృద్ధి సాధించింది.  (సరికొత్త గుర్తింపుని ఆవిష్కరిస్తోంది స్టార్‌ మా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా