Amrin Qureshi Birthday: ఈ బర్త్‌డే నాకు చాలా ప్రత్యేకం: హీరోయిన్‌ - Sakshi
Sakshi News home page

ఈ బర్త్‌డే నాకు చాలా ప్రత్యేకం: హీరోయిన్‌

Published Mon, Apr 12 2021 9:16 AM

This Birthday Very Special To Me Heroine Amrin Qureshi Says - Sakshi

‘‘హీరోయిన్‌గా జరుపుకున్న నా మొదటి పుట్టినరోజు ఇది.. ఈ బర్త్‌డే నాకు చాలా ప్రత్యేకం’’ అని హైదరాబాద్‌ బ్యూటీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అమ్రిన్‌ ఖురేషీ అన్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 11న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా అమ్రిన్‌ ఖురేషీ మాట్లాడుతూ–‘‘ హైదరాబాద్‌ అమ్మాయిగా బాలీవుడ్‌లో బిజీ అవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్తమావ’ చిత్రాన్ని ‘బ్యాడ్‌బాయ్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

ఇందులో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తికి జోడీగా చేస్తున్నా. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జులాయి’ హిందీ రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. దక్షిణాదిలోనూ నాకు అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతా’’ అన్నారు.

Advertisement
Advertisement