కాజోల్‌తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం! | Do You Know This Bollywood Actor Kamal Sandesh Who Worked With Aamir and Kajol, Rare Facts In Telugu - Sakshi
Sakshi News home page

Kamal Sadanah Tragic Family Story: కాజోల్‌తో మొదటి సినిమా చేసిన హీరో.. ఆ విషాదం తర్వాత!

Published Wed, Aug 23 2023 3:50 PM

This Bollywood hero worked with Aamir and Kajol - Sakshi

కమల్ సదానా ఈ పేరు చాలామందికి తెలియదు. కమల్ తన నటన జీవితాన్ని స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కలిసి ప్రారంభించాడు. బెఖుడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారానే కాజోల్‌ కూడా అరంగేట్రం చేసింది.  ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కమల్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.  అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ అనుకోకుండా జరిగిన విషాదం అతన్ని మానసికంగా దెబ్బతీసింది. ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా తన కెరీర్‌ ముగిసినంత పనైంది. ఇంతకీ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఏమిటా విషాదం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 

(ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!)

బర్త్‌ డే రోజే విషాదం

తఖ్‌దీర్, ఏక్ సే బద్కర్ ఏక్, యాకీన్ వంటి చిత్రాలు నిర్మించిన దర్శకుడు బ్రిజ్ సదానాకు కమల్ జన్మించారు. బ్రిజ్ 1960- 70లో బాలీవుడ్‌లో విజయవంతమైన డైరెక్టర్‌గా పేరు సంపాదించారు.  1980ల మధ్య నాటికి ఆయన సినిమాలు ఫ్లాప్స్‌ అయ్యాయి. ఆ తర్వాత 1990లో కమల్ 20వ పుట్టినరోజున బ్రిజ్, అతని భార్య సయీదా ఖాన్ మధ్య గొడవ జరిగింది. బర్త్ డే వేడుకకు ఏర్పాట్లు చేసుండగానే కమల్ సదానాకు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంత వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. తన తండ్రి ఆవేశంతో తల్లి, సోదరినీ చంపి.. తాను కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. ఆ సమయంలో కమల్ బర్త్‌డే పార్టికీ వచ్చిన స్నేహితులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.  ఆ తీవ్ర విషాదంతో కమల్ సదానా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అయితే ఆ సమయంలో బ్రిజ్ మద్యం తాగినట్లు శవపరీక్షలో వెల్లడైంది.

కమల్ సదానా సినిమా కెరీర్

కమల్ 2000లో విడుదలైన కాళీ టోపీ లాల్ రుమాల్ తర్వాత సినిమాలకు విరామం తీసుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత 2005లో తన దర్శకత్వం వహించిన కర్కాష్‌ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా టీవీ షో కసమ్‌లో సహాయక పాత్రను కూడా పోషించాడు. 2007లో తన తండ్రి నిర్మించిన చిత్రానికి రీమేక్‌గా విక్టోరియా నంబర్ 203ని తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా బాగా ఆడలేదు.  నోరా ఫతేహి బాలీవుడ్ అరంగేట్రం చేసిన రోర్‌ చిత్రానికి కూడా కమల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపు  15 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన సలామ్ వెంకీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా 30  ఏళ్లకు మళ్లీ కాజోల్‌త కలిసి తెరపై కనిపించారు.  ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. ఏది ఏమైనా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన కాజోల్‌తో మొదటి సినిమా చేసిన కమల్.. ఆ తర్వాత కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చూస్తే అభినందించాల్సిందే. 

(ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)


 

Advertisement
Advertisement