మరో కొత్త వ్యాపారంలోకి స్టైలిష్‌ స్టార్‌, బన్నీ దూకుడు మామూలుగా లేదుగా.. | Sakshi
Sakshi News home page

Allu Arjun: మరో కొత్త వ్యాపారంలోకి స్టైలిష్‌ స్టార్‌, బన్నీ దూకుడు మామూలుగా లేదుగా..

Published Wed, Jan 12 2022 6:02 PM

Buzz: Allu Arjun Will Be Launch Brand AA On Clothes Business - Sakshi

Allu Arjun Starts New Business Soon: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ మరో కొత్త బిజినెస్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఆయన బ్రాండ్‌ నేమ్‌ ఏఏ(AA) పేరుతో కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు బన్నీ ప్లాన్‌ చేస్తున్నాడట. స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిన బన్నీ వరస చిత్రాల విజయంతో దూసుకుపోతున్నాడు. తాజాగా పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కొత్త బ్రాండ్‌ను లాంచ్‌ చేయనున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: ‘స్పెషల్‌ సాంగ్‌తో పేరొస్తుందని బన్నీ ఒప్పించాడు’

ఇప్పటికే బన్నీ AA బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్‌లో చూసిన AA బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తు వస్తున్నాడు. అంతేకాదు తను ధరించే టీ-షర్ట్స్‌పై కూడా AA అనే బ్రాండ్‌ నేమ్‌ కనిపిస్తుంది. ఇప్పడు అదే పేరుతో దుస్తుల వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడట ఈ స్టైలిష్‌ స్టార్‌. వాస్తవానికి ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సి ఉందట.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్‌..

కానీ కరోనా నేపథ్యంలో ఆలస్యమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే బన్నీ మల్టిప్లెక్స్‌ బిజినెస్‌ స్టార్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ అమీర్‌ పేటలోని సత్యం థియేటర్‌ స్థానంలో ఏషియన్‌ సినిమాస్‌ అనే మల్లీప్లెక్స్‌ను బన్నీ అందుబాటులోకి తీసుకురాబోతున్నాడు. దీనిక సంబంధించిన వర్క్‌ కూడా మొదలైంది. 

Advertisement
Advertisement