Ginna: ‘జిన్నా’ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు రూ.10 కోట్లు.. మంచు విష్ణుకి భారీ లాభం!

3 Nov, 2022 16:56 IST|Sakshi

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 21న విడుదైంది.  ఈ సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా.. థియేటర్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు కూడా అదే రోజు విడుదల కావడంతో ‘జిన్నా’కు ఆశించిన కలెక్షన్స్‌ రాలేకపోయాయి. అయితే ‘జిన్నా’మాత్రం మంచు ఫ్యామిలీకి మంచి లాభాలే తెచ్చిపెట్టినట్లు టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం.

‘జిన్నా’ కంటే ముందు మంచు విష్ణు నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్బింగ్‌ అయి మంచి వ్యూస్‌ సంపాదించుకున్నాయి. దానికి తోడు ‘జిన్నా’లో బాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సన్నీ  లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ నటించడంతో దాదాపు రూ.10 కోట్లకు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. రూ. 15 కోట్లతో జిన్నా సినిమాను నిర్మించారు. ఒక హిందీ డబ్బింగ్‌ ద్వారానే రూ.10 కోట్లు వచ్చాయి. ఇక డిజిటల్‌ రైట్స్‌, థియేట్రికల్‌ కలెక్షన్స్‌, ఆడియో రైట్స్‌.. అన్ని కలుపుకుంటే బడ్జెట్‌ కంటే ఎక్కువే వచ్చాయట. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారా ఎక్కువ లాభం వచ్చిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.

మరిన్ని వార్తలు