అనసూయ 'ది ఛేజ్‌' టీజర్‌ చూశారా?

31 Jan, 2021 06:02 IST|Sakshi
రైజా విల్సన్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా ‘నిను వీడను నీడను నేనే’ లాంటి థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కించిన కార్తీక్‌ రాజు ప్రస్తుతం రెజీనాతో ‘నేనే నా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్‌ తెరకెక్కించిన మరో చిత్రం ‘ది ఛేజ్‌’ విడుదలకు సిద్ధమైంది. తమిళ చిత్రం ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’ ఫేమ్‌  రైజా విల్సన్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అనసూయ ఓ ముఖ్య పాత్ర చేశారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఈ టీజర్‌కి విశేష స్పందన లభించింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంచి డేట్‌ చేసుకుని రెండు భాషల్లోనూ ఒకేసారి సినిమాని విడుదల చేస్తాం. మంచి ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వేల్‌ రాజ్, సంగీతం: శ్యామ్‌ సి.ఎస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఆనంద్‌ పెనుమత్స, ప్రభా చింతలపాటి, నిర్మాత: రాజశేఖర్‌ వర్మ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు