RRR Movie: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు: ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి చిరు, ఏఆర్‌ రెహమాన్‌ శుభాకాంక్షలు

11 Jan, 2023 09:05 IST|Sakshi

అంతర్జాయతీయ స్థాయిలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్‌. అయితే తర్వాత స్థానంలో ఉండే మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు. ఈ రెండు అవార్డులను చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలలోని బెస్ట్ సెలబ్రెటీలను ఎంపిక చేసి ఈ అవార్డులను అందచేస్తారు.

తాజాగా ఈ గోల్డెన్‌ గోబ్‌ అవార్డు మన ఇండియన్‌ సినిమా గెలుచుకోవం విశేషం. కాగా ఈ అవార్డును గెలిచిన తొలి ఇండియన్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ కింద గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. ఈ అవార్డును ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందుకున్నారు. అంతర్జాతీయ స్టేజ్‌పై ఈ అవార్డు ప్రకటించగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అంత పట్టనంత ఆనందంలో తేలిపోయింది. ఇ‍క ఈ అవార్డును అందుకున్న కీరవాణికి, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘ఎంత అద్భుతం. ఇదో చారిత్రాత్మక విజయం.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటు నాటు పాటకు గానూ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకున్న ఎమ్‌ఎమ్‌ కీరవాణిగారికి శతకోటి వందనాలు. అత్యున్నత చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం, రాజమౌళికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటను చూసి ఇండియా గర్వపడుతుంది’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. అలాగే ఆస్కార్‌ ఆవార్డు గ్రహిత, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు శభాకాంక్షలు తెలిపారు. ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి శుభకాంక్షలు. అలాగే రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కూడా కంగ్రాట్స్’ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు