విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు

15 Aug, 2020 02:57 IST|Sakshi

విన్నర్స్‌ రన్‌ ది వరల్డ్‌.... విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. ఈ డైలాగ్‌ శుక్రవారం దర్శకుడు దేవా కట్టా విడుదల చేసిన ‘ఇంద్రప్రస్థం’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం థీమ్‌ పోస్టర్‌లోనిది. దేవా కట్టా రచయితగా, దర్శకునిగా చేస్తున్న తాజా చిత్రం ఇది. ‘‘ఒకప్పటి మంచి స్నేహితులు, రాజకీయ ప్రత్యర్థులుగా మారి 30 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిన ఇద్దరి నాయకుల ప్రయాణం ప్రధానాంశంగా కాల్పనిక సన్నివేశాలతో తయారవుతున్నదే నా సినిమా.

ఇద్దరు రాజకీయ దిగ్గజాల స్నేహానికి, రాజకీయాల్లో వారి శత్రుత్వానికి, ఆ ఇద్దరికీ వారి అనుచరులు ఇచ్చే గౌరవానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు దేవా కట్టా. ప్రూడోస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షా.వి, తేజ.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  టీజర్‌కు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను సురేశ్‌ బొబ్బిలి అందించారు. ప్రస్తుతం దేవా కట్టా సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న 14వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు