తమిళ్‌లోనే మొదటి సినిమా ఎందుకు నిర్మించానంటే..: ఎంఎస్‌ ధోని

12 Jul, 2023 06:57 IST|Sakshi

ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఎంఎస్‌ ధోని చైన్నెలో తన సతీమణి సాక్షి ధోనితో కలిసి సందడి చేశారు. ఈయన తాజాగా చిత్ర నిర్మాణం రంగంలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తొలి ప్రయత్నంగా తమిళంలో ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్‌ కల్యాణ్‌, నటి ఇవాన జంటగా నటించిన ఇందులో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!)

ఈ చిత్రం ద్వారా రమేష్‌ తమిళమణి సంగీతాన్ని అందిస్తూ, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తమిళంలో చిత్రాన్ని నిర్మించడం గురించి మాట్లాడుతూ మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న ఇంట్లో బాస్‌ ఎవరన్నది అందరికీ తెలిసిందేనన్నారు. తన భార్య చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు.

తాను క్రికెట్‌ క్రీడాకారుడిగా పరిచయం అయ్యింది చైన్నెలోనేననీ, అదేవిధంగా తాను టెస్ట్‌ హైహెస్ట్‌ స్కోర్‌ చేసింది కూడా చైన్నెలోనేని చెప్పారు. తాము నిర్మించిన తొలి చిత్రం కూడా తమిళంలోనే గాని కాబట్టి తనకు చైన్నె చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే తాను 2008లోనే ఐపీఎల్‌ క్రికెట్‌ ఆడినప్పుడే చైన్నెతో ఎడాప్ట్‌ అయినట్టు చెప్పారు. అలా తనకు చైన్నెకు పరస్పర ప్రేమ కారణంగానే తొలిచిత్రాన్ని తమిళంలో నిర్మించినట్లు వివరించారు. చాలా త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రం ఎల్‌జీఎం అని చెప్పారు. చిత్ర షూటింగ్‌కు ముందు యూనిట్‌ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని భావించానన్నారు.

(ఇదీ చదవండి: Bro Movie: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!)

అందుకే యూనిట్‌ సభ్యులకు రోజూ మంచి ఆహారం అందించాలని, అదేవిధంగా ఏ విషయంలోనైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై పునరాలోచన ఉండరాదని నిర్వాహకులకు చెప్పానన్నారు. తల్లి, కాబోయే భార్య మధ్య ఓ యువకుడి ఎదుర్కొనే ఘటనల కథే ఈ చిత్రం అని ధోని చెప్పారు. చిత్రాన్ని నేను తన కూతురితో కలిసి చూసానని చాలా బాగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు