Dhoni Production Planning To Make a Film With Young Heroes in Telugu - Sakshi
Sakshi News home page

Dhoni-Tollywood: టాలీవుడ్ వైపు చూస్తున్న ధోనీ.. రీజన్ అదే!

Published Tue, Jul 11 2023 8:53 PM

Dhoni New Movie With Telugu Hero - Sakshi

మొన్నటివరకు క్రికెట్‌లో రెచ్చిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం బిజినెస్ లతో బిజీ అవుతున్నాడు. మిగతా వాటి సంగతేమో గానీ సినిమా నిర్మాణంలోకి రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ధోనీ ఎంటర్ టైన్‌మెంట్స్ స్థాపించి ఫస్ట్ ఫస్ట్ తమిళంలో 'LGM' అనే సినిమా తీశాడు. తాజాగా దాని ట్రైలర్ రిలీజైంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఓ హీరోతో ధోనీ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడట.

ఇకపై సినిమాలే
మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. ఓ సాధారణ క్రికెటర్ గా జట్టులోకి వచ్చినప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో కెప్టెన్ అయిపోయాడు. మన జట్టు మూడు ప్రపంచకప్‌లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ లీగ్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు. అందుకే సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!)

తెలుగు హీరోతో
తొలుత తమిళంలో సినిమా తీసినప్పటికీ, తెలుగు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు బడా హీరోలతో పాటు యంగ్ హీరోలతో ధోనీ ప్రొడక్షన్స్ టచ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. 'LGM' రిలీజ్ తర్వాత తెలుగు చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. దీనికి సమాంతరంగా హిందీలోనూ మూవీస్ తీసేందుకు ధోనీ-సాక్షి రెడీ అవుతున్నారు. మరి ధోనీ సినిమాలో ఛాన్స్ కొట్టే లక్కీ టాలీవుడ్ హీరో తెలియాల‍్సి ఉంది.

టాలీవుడ్ ఎందుకు?
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోలతో మూవీస్ చేస్తే.. వాళ్ల ఇమేజ్ కి తోడు తనది కూడా తోడవుతుంది. అది సినిమాపై అంచనాలు పెరగడానికి, కలెక్షన్స్ రావడానికి వర్కౌట్ అయ్యే అవకాశముంది. అలానే తెలుగులో ఇప్పుడు చాలామందికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. అలానే ధోనీ అడిగితే కచ్చితంగా ఒప్పుకోవచ్చు.

(ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement