హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లిన బాలీవుడ్‌ నటి

26 Mar, 2021 20:17 IST|Sakshi

బాలీవుడ్‌ నటి దియా మీర్జా ఇటీవలె రెండో పెళ్లి చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ముంబై బాంద్రాలోని నివాసంలో అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత భర్త వైభవ్‌తో కలిసి హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ సందర్భంగా మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్న నటి..అక్కడి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. 'ప్రతీ క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం. స్వర్గంలా ఉన్నట్లుంది' అంటూ మాల్దీవులపై మనసు పారేసుకుంది. భర్తతో కలిసి మాల్దీవుల్లో సేద తీరుతున్న దియా..అక్కడి అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


ఇక 2014లో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడిపోయారు. తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. భర్తతో విడాకుల అనంతరం వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైభవ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కాగా, దియా కంటే అతను నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె మెదటిసారి నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్‌ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్‌2న విడుదల కానుంది. 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

చదవండి : రెండో వివాహం.. ట్రెండ్‌ సెట్‌ చేసిన నటి
నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్‌ గిఫ్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు