నవ్వుల వ్యాక్సిన్‌ సిద్ధం చేస్తాం

23 Nov, 2020 00:13 IST|Sakshi
డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి

అనిల్‌ రావిపూడి

‘‘మన ఎదుగుదలను పోల్చిచూసుకోవడానికి మన పుట్టినరోజులు చాలా ఉపయోగపడతాయి. అందుకే పుట్టిన రోజుకు తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో మంచి విజయాలు అందుకుని, ఫామ్‌లో ఉన్నారాయన. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న విశేషాలు.

► దర్శకుడిగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. నాతో సినిమా చేసిన స్టార్స్‌ అందరూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు.. ప్రతిసారి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాను. ఈ ప్రయాణంలో ‘దిల్‌’ రాజుగారి సహాయం కూడా మరువలేనిది.

► నాకు సినిమాయే ఎనర్జీ. సినిమా అంటే నాకు స్వర్గం.. స్వర్గంలో ఉన్నవారెవరైనా నీరసంగా ఉంటారా? అందుకే ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాను. అలానే ఈ ఎడాది నాకు అన్ని రకాలుగా గుర్తుండే సంవత్సరం. ఈ ఏడాది మా కుటుంబం పెద్దది అయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజు మాకు బాబు (అజయ్‌ సుర్యాంశ్‌) పుట్టాడు. సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అయింది.

► ‘ఎఫ్‌ 2’ అనేది దర్శకుడిగా నన్ను మార్చేసిన సినిమా. యాక్షన్‌ సబ్జెక్ట్స్‌ చేస్తున్న నాకు పూర్తి ఫ్యామిలీ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ‘ఎఫ్‌2’ సినిమా చేశా. 2019 సంక్రాంతిని నవ్వుల మయం చేసేసింది ఆ సినిమా. ‘దిల్‌’ రాజుగారి బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నింట్లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అదే అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. ‘ఎఫ్‌ 3’లో మరింత ఫన్‌ ఉంటుంది. డిసెంబర్‌ 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం అందరూ కరోనాకు మందు కనుక్కొనే పనిలో ఉన్నారు. ఈలోపల మేము ‘ఎఫ్‌ 3’తో నవ్వుల వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు