రాజు గారి గది 4 స్క్రిప్ట్‌ రెడీ అయిందన్న ఓంకార్‌

13 Jun, 2021 16:11 IST|Sakshi

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఓంకార్‌ డిఫరెంట్‌ హోస్టింగ్‌ స్టైల్‌తో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన రియాలిటీ షోలను ప్రేక్షకులకు పరిచయం చేసి అలరించిన ఆయన 'జీనియస్‌' చిత్రంతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఓ హారర్‌ స్క్రిప్ట్‌తో మరోసారి వెండితెరపై తన లక్‌ పరీక్షించుకున్నాడు. అలా రాజుగారి గది సినిమాను తెరకెక్కించాడు. ఇది సూపర్‌ హిట్టవ్వడంతో అదే ఊపులో సీక్వెల్‌ తీశాడు.

అదీ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తన తమ్ముడు అశ్విన్‌, హీరోయిన్‌ అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో 'రాజు గారి గది 3' సినిమా రూపొందించాడు. కానీ ఇది ఆశించిన స్థాయిలో క్లిక్‌ అవ్వలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో సినిమాలు రావని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ తన దగ్గర 'రాజు గారి గది 4' కథ సిద్ధంగా ఉందంటున్నాడు ఓంకార్‌. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'రాజు గారి గది 4' స్క్రిప్ట్‌ రెడీ అయిందన్నాడు. దీనితోపాటు ఓ థ్రిల్లర్‌, స్పోర్ట్స్‌, గ్రామీణ నేపథ్యంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ కరోనా వల్ల ఇవేవీ సెట్స్‌ మీదకు వెళ్లలేదన్నాడు.

చదవండి: Sardar Ka Grandson: ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు