Shankar planning a multistarrer with Shah Rukh Khan and Vijay - Sakshi
Sakshi News home page

Director Shankar : శంకర్‌ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్‌? రూ. 900కోట్ల బడ్జెట్‌!

Published Mon, Feb 13 2023 9:29 AM

Director Shankar Planning Multistarrer With Sha Rukh Khan And Vijay - Sakshi

భారీ చిత్రాలకు కేరాఫ్‌ దర్శకుడు శంకర్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్‌తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్‌ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్‌ కథానాయకుడిగా ఇండియన్‌ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ నటుడు రామ్‌చరణ్‌తో పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్‌ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఆయన రూ.900 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్‌. ఆ క్రేజీ కాంబినేషన్‌ దళపతి విజయ్, బాద్షా షారుక్‌ ఖాన్‌. ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను తీసుకునే దర్శకుడు శంకర్‌ ఈ చిత్రానికి అండర్‌ వాటర్‌లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్‌. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన హేరామ్‌ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఇక దళపతి విజయ్‌ ఇంతకుముందే శంకర్‌ దర్శకత్వంలో నన్బన్‌ చిత్రంలో నటించారు. విజయ్‌ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్‌ ఖాన్‌కు విజయ్‌కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌లో విజయ్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్‌ ఖాన్, విజయ్‌ కాంబినేషన్‌లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
Advertisement