Sakshi News home page

The Elephant Whisperers: 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్!

Published Mon, Aug 7 2023 4:36 PM

The Elephant Whisperers Bomman Says Dont Know Who Sent Legal Notice - Sakshi

ఆర్ఆర్ఆర్‌తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్‌లోనూ వాటా ఇస్తామని కార్తికి  చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 

(ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!)

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్‌ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్‌ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్‌ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం.

ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్‌తో సీన్ కాస్తా రివర్స్ అయింది. 

(ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!)

అసలు కథేంటంటే.. 

తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిం ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్‌ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఈ కథను తెరకెక్కించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement