F3 Movie: ముందో.. వెనకో.. థియేటర్స్‌లోనే పక్కా | Sakshi
Sakshi News home page

F3 Movie: ముందో.. వెనకో.. థియేటర్స్‌లోనే పక్కా

Published Sun, Jan 30 2022 8:01 AM

F3 Movie To Release On April 28th In Theaters - Sakshi

ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అంటూ ‘ఎఫ్‌ 2’లో హీరోలు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లతో కామెడీ చేయించారు అనిల్‌ రావిపూడి. ఈ ఇద్దరు హీరోలకు తోడు తమన్నా, మెహరీన్, నటుడు రాజేంద్రప్రసాద్‌ కూడా సందడి చేశారు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ అంటూ ఈ కాంబినేషన్‌ మరింత వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈసారి కీలక తారాగణంలో సునీల్, సోనాల్‌ చౌహాన్‌ కూడా ఉన్నారు.

‘ఎఫ్‌ 2’ని నిర్మించిన ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌ టాకీ పార్ట్‌ పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని రిలీజ్‌  చేయాలనుకుంటున్నారు. ‘‘వస్తే కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా! థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సాయి శ్రీరామ్, కో–ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి. 

Advertisement
Advertisement