ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్ | List Of 22 Movies And Web Series Releasing On OTT Platforms On Friday October 27th, 2023 - Sakshi
Sakshi News home page

Friday OTT Movies, Web Series Releases: ఒక్కరోజే ఓటీటీల్లోకి 22 మూవీస్.. అవి కాస్త స్పెషల్!

Published Wed, Oct 25 2023 11:23 PM

Friday OTT Release Movies Telugu October 27th 2023 - Sakshi

శుక్రవారం వచ్చిందంటే చాలు సాఫ్ట్‌వేర్ బిడ్డలు రిలాక్స్ అయిపోతారు. కాలేజీ పోరలు చిల్ అవుతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్తగా ఏ సినిమా వచ్చిందా? దాన్ని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటే ఈ వారం థియేటర్లలోకి వచ్చేవాటిలో సంపూ 'మార్టిన్ లూథర్‌కింగ్' సినిమా తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు.

(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఇకపోతే ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చంద్రముఖి 2, పెబ్బల్స్, చాంగురే బంగారు రాజా అనే తెలుగు సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీసులు కూడా రాబోతున్నాయి. ఇంతకీ అవి ఏయే ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది కింద లిస్ట్ ఉంది చూసేయండి.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27)

నెట్‌ఫ్లిక్స్

  • పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ సినిమా
  • సిస్టర్ డెత్ - స్పానిష్ చిత్రం
  • టోర్ - స్వీడిష్ సిరీస్
  • ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ - కొరియన్ సినిమా
  • కాస్ట్ ఎవే దివా - కొరియన్ సిరీస్
  • చంద్రముఖి 2- తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)
  • క్రాషింగ్ ఈద్ - అరబిక్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ఇరైవన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)
  • లాంగ్ లివ్ లవ్ - థాయ్ చిత్రం (స్ట్రీమింగ్)
  • వన్ ఫోర్: ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)
  • ప్లూటో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • కన్సక్రేషన్ - ఇంగ్లీష్ మూవీ
  • సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - జర్మన్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)

ఆహా

  • యారో - తమిళ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • కాఫీ విత్ కరణ్ సీజన్ 8 - హిందీ టాక్ షో (స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • పెబ్బల్స్ - తమిళ మూవీ 

జీ5 

  • నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ - బెంగాలీ చిత్రం

ఈ విన్

  • చాంగురే బంగారు రాజా - తెలుగు సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • కాబ్ వెబ్ - ఇంగ్లీష్ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • కర్సస్! - ఇంగ్లీష్ సిరీస్
  • ద ఎన్‌ఫీల్డ్ పోల్టర్‌గిస్ట్ - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!)

Advertisement
Advertisement