నాన్న.. నీ ఫోన్‌ కాల్స్‌, మాటలు..అన్ని మిస్‌ అవుతున్నా: కృష్ణ కూతురు మంజుల ఎమోషనల్‌

16 Nov, 2022 10:20 IST|Sakshi

తండ్రిని తలచకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.‘ప్రియమైన నాన్న.. మీరు మాకు, ఈ ప్రపంచానికి సూపర్‌స్టార్‌వి. ఇంట్లో ఎప్పుడూ సాదాసీదా తండ్రిలాగే వ్యవహరించేవాడివి. ఎలా జీవించాలో మీరు మాకు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. మీరు మీ చర్యల ద్వారా మాకు బోధించారు. మీ సరళత, సౌమ్యత, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన మరియు దాతృత్వం .. అసమానమైనవి.

సినిమాకి, మీ వారసత్వానికి చేసిన సేవలు ఎప్పటికీ బతికే ఉంటాయి. నువ్వే నా బలం, నువ్వే నాకు వెన్నెముక, నువ్వే నా హీరో. నీ ప్రేమ అంతులేని సముద్రం. మాకు అవసరమని మాకు తెలియనప్పుడు కూడా మీరు మాకు కావాల్సినవన్నీ ఇచ్చారు.ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నాను.  ప్రతి రోజు ఉదయం 11 గంటల పోన్‌ కాల్స్‌, సంభాషణలను కోల్పోతున్నాను. మీరు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను నాన్న’అని తన ఇన్‌స్టా ఖాతాలో మంజుల రాసుకొచ్చింది. కాగా, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)

మరిన్ని వార్తలు