బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతో ‘గూగుల్‌ కుట్టప్ప’  | Sakshi
Sakshi News home page

కుటుంబ కథాచిత్రంగా ‘గూగుల్‌ కుట్టప్ప’ 

Published Tue, Feb 1 2022 9:48 AM

Google Kattappa Movie Update - Sakshi

'గూగుల్‌ కుట్టప్ప' చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆ చిత్ర దర్శకద్వయం శబరి, శరవణన్‌ పేర్కొన్నారు. వీరు కేఎస్‌.రవికుమార్‌ శిష్యులు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ చిత్రానికి ఇది రీమేక్‌. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్, లాస్లియా హీరో హీరోయిన్లుగా నటించారు. యోగిబాబు, మనోబాల, కుట్టి రోబో కీలక పాత్రలు పోషించారు.  

ఆర్కే సెల్యూలాయిడ్‌ పతాకంపై కేఎస్‌.రవికుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి కల్లాల్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను పోషించింది. జిబ్రాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇది ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఉంటుందని చిత్రం దర్శకద్వయం పేర్కొన్నారు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని, భావోద్వేగాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement