Ruhani Sharma Starrer Her Chapter 1 Telugu Trailer Viral On Youtube - Sakshi
Sakshi News home page

Her Trailer Telugu: పోలీస్‌గా మరో యంగ్ హీరోయిన్.. ఈసారి!

Published Sun, Jul 9 2023 5:50 PM

Her Trailer Telugu Ruhani Sharma - Sakshi

'చి.ల.సౌ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహానీ శర్మ డిఫరెంట్ గెటప్ లో కనిపించింది.  HER (హెర్) లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఈ ట్రైలర్ ఉండటం విశేషం.

ట్రైలర్ లో రుహానీ శర్మ ఫుల్ సీరియస్ మోడ్ లో కనిపించింది. ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ సినిమా రేంజ్ పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తోంది. కెరీర్ లో రుహానీ శర్మ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. 

'ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉండేది. ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చేయగలనా అని ఒక డౌట్ ఉంది కానీ డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాను. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు నటించానని అనుకుంటున్నాను. జులై 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది' అని రుహానీ శర్మ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!)

Advertisement
Advertisement