శుభవార్త చెప్పిన కార్తీ.. థ్యాంక్స్‌ అంటూ సూర్య ట్వీట్‌

20 Oct, 2020 21:13 IST|Sakshi

చెన్నై: తమిళ హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిదంటూ కార్తీ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ గొప్ప ప్రయాణంలో తమకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోలేమని, తమ బిడ్డకు అందరి అశీస్సులు కావాలని కోరారు. థాంక్యూ గాడ్ అంటూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. సోదురుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో హీరో సూర్య కూడా తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రసవం చేసిన డాక్టర్‌ నిర్మలా జయశంకర్‌, నర్సులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్‌ అని పేరు పెట్టారు. తాజాగా మరో బిడ్డ జన్మించడంతో కార్తికి సోషల్ మీడియాలో ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు