మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్‌, సుప్రియ

16 Dec, 2021 20:21 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: చెక్‌ బౌన్స్‌ కేసులో హీరో సుమంత్‌, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా.. ఓ నరుడా సినిమాకు సంబంధించి తనకిచ్చిన చెక్‌ బౌన్స్‌ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్‌ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశారు.

కాగా, ఈ సినిమాకు హీరోగా సుమంత్‌, నిర్మాతగా సుప్రియ ఉన్నారు. అదే సినిమాకు కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్‌ అందించారు. ఈ వ్యవహారంలోనే తనను మోసం చేశారని మార్కాపురంలో శ్రీనివాసరావు కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్‌, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. 

చదవండి: (మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..)

మరిన్ని వార్తలు