'2018' డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో రష్మిక? | Sakshi
Sakshi News home page

'2018' డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో రష్మిక?

Published Mon, Aug 7 2023 5:18 AM

Heroine Rashmika Mandanna paired with hero Vikram next - Sakshi

హీరోయిన్‌ రష్మికా మందన్న హీరో విక్రమ్‌కి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ‘2018’ అనే చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్‌ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌. ఈ సినిమా మలయాళంలో అద్భుత విజయాన్ని సాధించి బాక్సాఫీస్‌ కొత్త రికార్డులను సృష్టించింది. కాగా జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లో చేయనున్నారు.

ఈ చిత్రంలో విక్రమ్‌ హీరోగా నటిస్తారని, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత సుభాస్కరన్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో హీరోయిన్ గా రష్మికా మందన్న, మాళవిక మోహనన్స్  పేర్లు వినిపించాయి. అయితే రష్మికా మందన్న ఫైనల్‌ అయ్యారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విక్రమ్‌– రష్మిక జోడీ అధికారికంగా ఓకే అయితే... కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్‌ ‘వారిసు’ చిత్రాల తర్వాత రష్మికా మందన్న నటించనున్న మూడో తమిళ సినిమా ఇదే అవుతుంది.

Advertisement
Advertisement