'అవన్నీ రూమర్స్‌ మాత్రమే.. ఎవరూ నమ్మకండి' | Hollywood Actress Sydney Sweeney React On Day Drinker Movie Chance - Sakshi
Sakshi News home page

'అవన్నీ రూమర్స్‌ మాత్రమే.. ఎవరూ నమ్మకండి'

Published Mon, Apr 1 2024 12:40 PM

Hollywood Actress Sydney Sweeney Get Day Drinker Movie Chance - Sakshi

పొద్దున్నే నిద్ర లేవడం లేవడమే పెద్ద రూమర్‌ విన్నాను అంటూ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు హాలీవుడ్‌ నటి సిడ్నీ స్వీనీ. జానీ డెప్‌ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘డే డ్రింకర్‌’లో హీరోయిన్‌గా సిడ్నీ స్వీనీ నటించనున్నారనే ప్రచారం హాలీవుడ్‌లో జరుగుతోంది. ఈ వార్తను ఉద్దేశించే నో నో... అంటూ సిడ్నీ పై విధంగా స్పందించారు.

అది మాత్రమే కాదు... ‘‘రూమర్స్‌ వస్తుంటాయి. వాటిని వదిలేయండి. మీరు (ప్రేక్షకులు) మాత్రం థియేటర్‌కు వెళ్లి ఈ మధ్య విడుదలైన నా ‘ఇమ్మాక్యులేట్‌’ మూవీ చూడండి’’ అన్నారు సిడ్నీ. మైఖేల్‌ మోహన్‌ దర్శకత్వంలో సిడ్నీ స్వీనీ లీడ్‌ రోల్‌లో సైకలాజికల్‌ హారర్‌ మూవీగా రూపొందిన ‘ఇమ్మాక్యులేట్‌’ మంచి టాక్‌తో దూసుకెళుతోంది.  

Advertisement
Advertisement