Assistant Director Arrest: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌

18 Apr, 2022 15:44 IST|Sakshi

గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హాథీరామ్‌ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్‌ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్‌ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్‌ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు