కొత్త సినిమా ప్రకటించిన మజ్ను డైరెక్టర్‌.. తెలంగాణ నేపథ్యంలో

25 May, 2023 04:17 IST|Sakshi

‘ఉయ్యాల జంపాల, మజ్ను’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరించి వర్మ. తన మూడో చిత్రాన్ని నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్నారాయన. ముదుగంటి క్రియేషన్స్ పై ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సందర్భంగా విరించి వర్మ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా నడిచే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా ఇది. 1980లో జరిగే ఒక పీరియాడిక్‌ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ  నేపథ్యంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నటీనటుల వివరాలు, టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వీఎస్‌ జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్‌.

మరిన్ని వార్తలు